News

వార్దా తుఫానుపై చంద్రబాబు సమీక్ష


వార్దా తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. తుపానును ఎదుర్కొనేందుకు అన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో పంటలు నష్టపోకుండా చూస్తామని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దన్నారు. తుపానుతో కురిసే వానలతో పంటకుంటలు నిండేలా చూడాలన్నారు. తుపాను అంచనాల కోసం ఇస్రోను సంప్రదిస్తున్నామని తెలియజేశారు. తుపాను ప్రభావిత జిల్లాలకు ఐఏఎస్‌లను పంపుతున్నామని చెప్పారు.